250 కోట్ల క్లబ్ లో చేరిన 2. ఓ


2. 0 3 Days World Wide collections

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం మూడు రోజుల్లో 250 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . 250 కోట్ల క్లబ్ లో 2. ఓ చిత్రం చేరడంతో రజనీకాంత్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు . అయితే బయ్యర్లు మాత్రం ఇంకా సంతోషంలో మునిగి తేలడానికి చాలా సమయమే పట్టేలా ఉంది ఎందుకంటే ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఇది . 550 కోట్ల బడ్జెట్ దాంతో భారీ రేట్లకు ఈ సినిమాని కొన్నారు బయ్యర్లు . వాళ్లంతా లాభాల్లోకి రావాలంటే కష్టమే అని వినబడుతోంది . ఇప్పటివరకు అయితే డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి కానీ పెట్టుబడి ఎక్కువ కావడంతో వాళ్లలో భయం నెలకొంది .

ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్ల ని సాధించింది 2. ఓ ,ఒక్క తమిళనాటనే వంద కోట్లు రాబట్టింది , ఇక తెలుగునాట మూడు రోజుల్లో 25 కోట్ల షేర్ వచ్చింది , అంటే ఇంకా 50 కోట్ల షేర్ రావాలన్న మాట. నిన్న ఆదివారం కావడంతో మంచి వసూళ్లు వచ్చి ఉంటాయి . ఇక ఈరోజు నుండి 2. ఓ చిత్రానికి అసలు సిసలైన పరీక్ష ఎదురు కాబోతోంది . రెండు రోజుల్లో 190 కోట్ల వసూళ్ల ని సాధించిన 2. ఓ మూడు రోజుల్లో 250 కోట్ల క్లబ్ లో చేరింది . ఈ లెక్కన 600 కోట్ల క్లబ్ లో చేరాలంటే ఎప్పుడో !

English Title: 2. 0 3 Days World Wide collections