వచ్చింది 40 కోట్లే …. మరి మిగతా సొమ్ము


2.0 Buyers not in safe zone

రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో వారం రోజుల్లో 40 కోట్ల షేర్ వచ్చింది. 40 కోట్ల షేర్ అంటే మాములు విషయం కాదు కాని ఇప్పుడు వచ్చింది సరిపోదు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని 76 కోట్లకు కొన్నారు. దాంతో 76 కోట్ల షేర్ వస్తేనే హిట్ అయినట్లు బయ్యర్లకు లాభాలు వచ్చినట్లు కానీ ఇప్పుడు వసూల్ అయ్యింది 40 మాత్రమే ! అంటే ఇంకా 36 కోట్ల షేర్ రావాలి అయితే అంత పెద్ద సొమ్ము రావడం కష్టమే అని తెలుస్తోంది.

రజనీకాంత్ కున్న క్రేజ్ తో ఈ భారీ వసూళ్లు వచ్చాయి. రజనీకాంత్ చిత్రాల్లోనే ఎక్కువ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి అయితే భారీ రేట్లకు అమ్ముడుపోయాయి కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తేనే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్తారు. అయితే 2. ఓ చిత్రం మాత్రం బయ్యర్లకు నష్టాలని తెచ్చేలా ఉంది. మరో 30 కోట్లు వస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు . కానీ అవి వచ్చేలా కనిపించడం లేదు.

English Title: 2.0 Buyers not in safe zone