2. ఓ ఏపీ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్


2.0 first day collections in AP and Telangana

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెలిసిందే . భారీ ఓపెనింగ్స్ సాధించిన 2. ఓ చిత్రం తెలుగునాట కూడా భారీ వసూళ్లు సాధించింది . నిన్న ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ లో కలిపి 12 కోట్లకు పైగా షేర్ సాధించింది . రజనీకాంత్ గత చిత్రాలు ఘోర పరాజయం పొందినప్పటికీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే లభించాయి . తెలంగాణలో 4కోట్ల 73 లక్షల షేర్ వచ్చింది , ఇక ఆంధ్రప్రదేశ్ లో 7 కోట్ల 80 లక్షల షేర్ ని వసూల్ చేసింది దాంతో ఈ సినిమా ని రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్న దిల్ రాజు , ఎన్వీ ప్రసాద్ , యువి క్రియేషన్స్ సంతోషంగా ఉన్నారు . ఈ జోరు ఇలాగె కొనసాగితే తప్పకుండా మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్నారు .

రెండు తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు ఇలా ఉన్నాయి

తెలంగాణ – 4. 73 కోట్ల షేర్

సీడెడ్ – 1. 98 కోట్ల షేర్

ఉత్తరాంధ్ర – 1. 65 కోట్ల షేర్

గుంటూరు – 1. 02 కోట్ల షేర్

కృష్ణా – 73 లక్షలు

నెల్లూరు – 73 లక్షలు

ఈస్ట్ – 96 లక్షలు

వెస్ట్ – 75 లక్షల షేర్

మొత్తం – 12. 53 కోట్ల షేర్

English Title: 2.0 first day collections in AP and Telangana