పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో సంక్రాంతి వరకు ‘2.0’ రన్ అవుతుంది


'2.0' will run up to Sankranthi with children and family audiences

సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన విజువల్ వండర్ ‘2.0’. ఈ చిత్రం నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 500 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎన్.వి.ఆర్. సినిమా అధినేత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం అంతా ఎలెక్షన్ మూడ్‌లోనే ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్‌గారికి ‘2.0’ యూనిట్ అభినందనలు తెలియజేస్తోంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌గారు ఎలా దూసుకెళ్తున్నారో.. మా సినిమా కూడా అలాగే విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన మా ‘2.0’ డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే రికార్డు సృష్టిస్తోందని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఈ సినిమా సంక్రాంతి వరకు ఫ్యామిలీ ఆడియన్స్, చిల్డ్రన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఇంతటి గొప్ప సినిమాని మాకు అందించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారికి, లైైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్‌కు ధన్యవాదాలు’’ అన్నారు.

English Title: ‘2.0’ will run up to Sankranthi with children and family audiences