400 కోట్లు వసూల్ చేసిన రజనీకాంత్ 2. ఓ


2. 0 World Wide 4 days collections

నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్ల భారీ వసూళ్ల ని సాధించాడు సూపర్ స్టార్ రజనీకాంత్ . 2. ఓ చిత్రం నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెలిసిందే . మొదటి రోజునే 120 కోట్ల వరకు రాబట్టిన 2. ఓ చిత్రం శని , ఆది వారాలలో భారీగా వసూళ్లు సాధించింది దాంతో మొత్తం మీద నాలుగు రోజుల్లో దాదాపు 11 వేల స్క్రీన్ ల ద్వారా 400 కోట్లు వసూల్క్ చేసింది . 2. ఓ చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు . అయినప్పటికీ రజనీకాంత్ కున్న క్రేజ్ తో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి .

550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2. ఓ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటించడంతో బాలీవుడ్ లో సైతం మంచి వసూళ్లు వస్తున్నాయి . అక్కడ ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని చేరుకుంది . తమిళంలో కూడా వంద కోట్లకు పైగా వసూల్ చేసింది 2. ఓ . తెలుగులో మాత్రం ఆ స్థాయి వసూళ్లు రావడం లేదు , ఇక్కడ నాలుగు రోజుల్లో 50 కోట్లు వసూల్ అయ్యాయి . శని , ఆదివారాలు కలిసి రావడంతో మొత్తానికి నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లు వసూల్ అయ్యాయి . అయితే మొదటి వారం తర్వాత 2. ఓ చిత్రం పరిస్థితి ఏంటి అన్నది తేలుతుంది .

English Title: 2. 0 World Wide 4 days collections