చైనాలో భారీ ఎత్తున విడుదలవుతున్న 2. ఓ చిత్రం


2 point 0 huge release in china

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం చైనాలో భారీ ఎత్తున విడుదల కానుంది . ఇంతకీ చైనాలో ఎన్ని థియేటర్ లలో ఎన్ని స్క్రీన్ లలో విడుదల అవుతుందో తెలుసా ……. 10,000 థియేటర్ లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అలాగే 3డి వెర్షన్ ని ఏకంగా 47000 స్క్రీన్ లలో రిలీజ్ చేయనున్నారు . ఇంత భారీ ఎత్తున విడుదల అంటే రికార్డుల మోత మోగడం ఖాయం అయితే ఆ రికార్డుల మోత ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పటికే పలు చిత్రాలకు థియేటర్ లు బుక్ అయి ఉన్నాయి కాబట్టి , 2. ఓ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ఇంకా పూర్తికాలేదు కాబట్టి ఈ సినిమా 2019 మేలో అక్కడ విడుదల చేయనున్నారు .

2, ఓ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి కానీ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో భారీ రేట్లకు బయ్యర్లకు అమ్మారు దాంతో భారీ షేర్ లు వస్తేనే బయ్యర్లు ఒడ్డున పడతారు . హిందీలో బాగానే వసూల్ చేస్తోంది , కానీ తెలుగులో మాత్రం ఆ స్థాయి వసూళ్లు రావడం లేదు మరి . రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .

English Title: 2 point 0 huge release in china