పాటల కోసం ప్యారిస్ కు అల వైకుంఠపురములో..


2 Songs to be canned for Ala Vaikunthapuramlo in Paris
2 Songs to be canned for Ala Vaikunthapuramlo in Paris

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే. సినిమా సంక్రాంతికి విడుదల కావాలని భావిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ను కూడా ప్రణాళిక పరంగా పూర్తి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తర్వాతి షెడ్యూల్ కోసం అల వైకుంఠపురములో టీమ్ ప్యారిస్ వెళ్లనున్నారట. అక్కడ రెండు పాటలను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పాటల కోసం బన్నీ కొత్త లుక్స్ లో కనిపించనున్నట్లు సమాచారం.

దసరా సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను అక్టోబర్ 8న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నవంబర్ చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో అల వైకుంఠపురములో చాలా స్పెషల్ గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. థమన్  సంగీత దర్శకుడు.