2018 సంచలనం విజయ్ దేవరకొండే

2018 super star Vijay Devarakondaటాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించిన హీరో విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న ఈ హీరో 2018 లో ప్రభంజనం సృష్టించాడు . చిన్న చిత్రంగా వచ్చిన గీత గోవిందం అవలీలగా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది . ఏమాత్రం అంచనాలు లేని చిత్రం వంద కోట్లు సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు . గీత గోవిందం చిత్రంలో పెద్దగా కథ లేదు కానీ స్క్రీన్ దానికి తగ్గట్లుగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల నటన తోడయ్యింది ఇంకేముంది బ్లాక్ బస్టర్ అయ్యింది .

 

గీత గోవిందం చిత్రం తర్వాత ఈ హీరో నటించిన నోటా విడుదల అయ్యింది అయితే నోటా సినిమా ఘోర పరాజయం పొందింది , దాని తర్వాత వచ్చిన టాక్సీ వాలా చిత్రం హిట్ అవుతుందని అనుకోలేదు ఎందుకంటే ఆ సినిమా మొత్తం లీక్ అయ్యింది కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ టాక్సీ వాలా సూపర్ హిట్ అయ్యింది . కేవలం 5 కోట్ల తో తెరకెక్కిన టాక్సీ వాలా 20 కోట్ల షేర్ రాబట్టింది . ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా గీత గోవిందం , టాక్సీ వాలా హిట్స్ అయ్యాయి . దాంతో ఈ ఏడాది సూపర్ స్టార్ గా విజయ్ దేవరకొండ నిలిచాడు .

English Title: 2018 super star Vijay Devarakonda