మెగా హీరోలకు కలిసొచ్చిన 2019మెగా హీరోలకు కలిసొచ్చిన 2019
మెగా హీరోలకు కలిసొచ్చిన 2019

మెగా హీరోలు అంటూ ఇప్పుడు దాదాపు అరడజనుకు పైగా హీరోలు టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్నారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి ప్రభావమే చూపుతుంటాయి. అయితే ఈ సంవత్సరం మెగా హీరోలకు ఏ విధంగా కలిసొచ్చిందో ఒకసారి చూద్దాం. 2019లో మెగా ఫ్యాన్స్ తో మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ భారీ అంచనాల మధ్య తుస్సుమనిపించింది. కలెక్షన్స్ యావరేజ్ గానే వచ్చినా కంటెంట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్సలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే దాన్నుండి మెగా ఫ్యాన్స్ త్వరగానే బయటపడ్డారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ చేసిన ఈ హంగామా ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది.

ఇక ఏప్రిల్ లో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరసగా ఆరు ప్లాపుల తర్వాత తేజ్ నటించిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 200 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం బాగుందనే టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం బాగా ఆడింది. అయితే విడుదలైన మిగతా భాషల్లో మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది.

సైరా హంగామా తర్వాత మరోసారి వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి నెగటివ్ ఛాయలున్న పాత్రలో గద్దలకొండ గణేష్ చిత్రాన్ని చేయగా, అది కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో వరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక 2019కు సరైన ముగింపును తేజ్ ఇచ్చాడు. ప్రతిరోజూ పండగే చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇక 2020 మెగా హీరోలకు. ఫ్యాన్స్ కు మరింత ఎగ్జైటింగ్ గా ఉండనుంది. రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నాడు. తేజ్ ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇదే ఏడాది సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.