2019 లో తెలుగులో దిగిన కొత్త పాపలుTollywood New Heroines in 2019
Tollywood New Heroines in 2019

ప్రకృతి ధర్మం ప్రకారం సినిమాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులోనూ తెలుగులో ఏంటంటే, హీరో ని బాబు అని పిలవాలి. ఇక పాపల విషయానికి వస్తే (మరి హీరోలను “బాబు” అని పిలిచినప్పుడు; హీరోయిన్స్ ని అలాగే పిలవాలి కదా.!) ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా ఎంతో మంది సినిమా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్ళలో చాలా తక్కువమంది తెరపై కనపడతారు. ఇక 2019 లో తెలుగు తెరకు అరంగేట్రం ఇచ్చిన హీరోయిన్స్ లో సక్సెస్ అయిన వాళ్ళను   ఒక్కసారి గమనిస్తే,

శివాత్మిక రాజశేఖర్ : హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే ఈమె కూడా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దొరసాని సినిమా చూసిన వారందరూ శివాత్మిక భవిష్యత్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని జోస్యం చెప్తున్నారు.

దివ్యంశ : నాగచైతన్య & సమంత కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమాలో నాగచైతన్య లవర్ గా ఈమె నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఆఫర్లు సాధిస్తోంది.  ఇక యూత్ మజిలీ సినిమాలో ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు

అనన్య : ఆసు మిషన్ కనిపెట్టిన గొప్ప వ్యక్తి చింతకింది మల్లేశం గారి బయోపిక్ మల్లేశం సినిమాలో ప్రియదర్శి సరసన అమాయకురాలైన భార్య పాత్ర లో అనన్య ఒదిగిపోయింది. ఇక ఆమె లోని చలాకీతనం అంతా రాబోయే సినిమాలలో మనకు కనపడుతుంది. ఈ సినిమాకు ప్రియదర్శి తరువాత మంచి పేరు వచ్చింది తనకే.

అనఘా : హీరో కార్తికేయ నటించిన “గుణ 369” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అనఘా. ఇక ఈ సినిమా తరువాత నుండి ఆమెను యూత్ “బుజ్జి బంగారం” అంటూ కలవరిస్తున్నారు. తన సహజమైన నటన మరియు అందాలతో అనఘా టాలీవుడ్ లో గట్టి ముద్ర వేసింది

ఇక వీరితోపాటు సాహో లాంటి పెద్ద సినిమాతో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాని “గ్యాంగ్ లీడర్” సినిమాతో ప్రియాంక ఆరుళ్ మోహన్; ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో “శృతి శర్మ” ; మీకు మాత్రమే చెప్తా సినిమాతో వాణీ భోజన్; సందీప్ కిషన్ థ్రిల్లర్ మూవీ “నిను వీడని నీడను నేనే” సినిమాతో “ఆన్య సింగ్”;  అటు ఆడియెన్స్ కి ఇటు ఇండస్ట్రీ కి గట్టిగా రిజిస్టర్ అయ్యారు.