టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ 2020 రివ్యూ!


టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ 2020 రివ్యూ!
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ 2020 రివ్యూ!

తెలుగు సినిమా ఈ దేశంలో బాలీవుడ్ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మిస్తూ వస్తోన్న ఇండస్ట్రీ. దాదాపు 180-190 సినెమాలు ప్రతీ ఏడాది విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి కరోనా ప్రభావం కారణంగా కేవలం 49 సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదలయ్యాయి. మరి వాటిలో ఏ సినిమాలు హిట్టయ్యాయో, ఏవి ఫట్టో ఒకసారి చూద్దామా!

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ఆరంభం అదిరిపోయింది. సంక్రాంతికి పోటీ పడి విడుదలయ్యాయి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు. ఈ రెండూ ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ ను అందించాయి. ఇక నితిన్ నటించిన భీష్మ కూడా ఆఫ్ సీజన్ లో విడుదలైనా కానీ మంచి విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి నెలాఖరులో వచ్చిన హిట్ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు 10 నెలల తర్వాత థియేటర్లలో విడుదలైన సినిమా కావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇదే సస్టైన్ చేయగలిగితే సినిమా హిట్ అవ్వడం ఖాయం.

అలాగే ఎన్నో ఆశలతో విడుదలైన డిస్కో రాజా, జాను, వరల్డ్స్ ఫేమస్ లవర్, అశ్వథామ వంటి చిత్రాలు నిరుత్సాహపరిచాయి.