2021 అఖిల్ కు చాలా కీలకం


2021 అఖిల్ కు చాలా కీలకం
2021 అఖిల్ కు చాలా కీలకం

అఖిల్ అక్కినేని నటిస్తోన్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది మొదట్లో చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్ గా పెట్టుకున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయిక కాగా బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశాలు. ఇది అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రం అవ్వనుంది. తన మొదటి చిత్రం వచ్చి ఐదేళ్లు పూర్తవుతోంది. ఈ ఐదేళ్ల కాలంలో అఖిల్ నటించినవి మూడే చిత్రాలు.

ఆ మూడు కూడా ప్లాపులుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో అఖిల్ కు వచ్చే ఏడాది కీలకం కానుంది. ఎందుకంటే తన 4,5 చిత్రాలు 2021లోనే విడుదలవుతాయి. ఈ రెండు సినిమాలు కనుక సక్సెస్ అయితే అఖిల్ కెరీర్ ట్రాక్ లో పడడం ఖాయం. మరి ఈ నేపథ్యంలో అఖిల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.