`హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` 3 గెట‌ప్స్‌.. 30 కాస్ట్యూమ్స్‌!

3 looks 30 costumes for pawan in Hari hara veeramallu
3 looks 30 costumes for pawan in Hari hara veeramallu

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం సమ‌ర్ప‌ణ‌లో మెగా సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై ద‌యాక‌ర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో నాయిక‌గా  బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క‌నిపించ‌బోతోంది.

17వ శ‌తాబ్దానికి చెందిన మొఘ‌ల్ కాలం, కుతుబ్ షాహీల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఇందులో బందిపోటుగా క‌నిపిస్తార‌ట‌. కోఒహినూర్ వ‌జ్రం ప్ర‌ధాన భూమిక పోషించ‌నున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 40 శాతం పూర్త‌యింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఐశ్వ‌ర్యా రాజీవ్‌ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది.

`ఇదొక పిరియాడిక్ డ్రామా. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారి కోసం 30 ర‌కాల దుస్తుల‌ని ఫైన‌ల్‌గా ఎంపిక చేశాం.  ప‌వ‌న్‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో క‌నిపిస్తారు. కాబ‌ట్టి కాస్ట్యూమ్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అయ‌న దుస్తులు, లుక్ తీరు తెన్నులు ఎలా వుండాల‌నే దానిమీద చాలా రీసెర్చ్ చేశాం. దుస్తుల గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు ఏమ‌నుకుంటారో అని అనుకున్నాం. రెండు ర‌కాల కాస్ట్యూమ్స్ ట్రై చేసిన తరువాత ఓకే చెప్పారు. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో స‌హా ఇత‌ర వ్య‌క్తుల కాస్ట్యూమ్స్ కోసం ఇండియాలోని వేర్వేరు ప్రాంతాల్లోని 1000కి పైగా థానుల ఫ్యాబ్రిక్స్‌ని తెప్పించి డిజైన్స్ ప్లాన్ చేశాం. సినిమాలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడు ర‌కాల గెట‌ప్ ల‌లో క‌నిపిస్తారు` అని తెలిపింది.