“త్రీ మంకీస్”  సబ్జెక్ట్ లో ఉన్న పెద్ద ఫిలాసఫీ


“త్రీ మంకీస్”  సబ్జెక్ట్ లో ఉన్న పెద్ద ఫిలాసఫీ
“త్రీ మంకీస్”  సబ్జెక్ట్ లో ఉన్న పెద్ద ఫిలాసఫీ

“మన జీవితంలో మనం కలిసే వ్యక్తులను ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు కలుస్తామో.? అంత భగవంతుడికే తెలుసు. ఎందుకంటే మనదీ అనుకునే ఈ బాట అసలు పైవాడు మనతో ఆడించే ఆట”.  కోతి అనే జీవి చంచాలత్వానికి మాత్రమే కాదు.. పట్టుదలకు కూడా క్రమశిక్షణకు కూడా ఒక సింబల్. కావాలంటే ప్రపంచంలో అనేక సందర్భాల్లో ఉన్న అనేక ఉదాహరణలను పరిశీలించండి. మీకే తెలుస్తుంది. ఇక ప్రస్తుతం “త్రీ మంకీస్” పేరుతో ఒక సినిమా రిలీజ్ అవుతోంది.

జబర్దస్త్ షో ద్వారా పాపులరైన సుదీర్, శ్రీను, రాం ప్రసాద్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.  ఈ మూవీ లో కామెడీ తోపాటు ఎమోషనల్ అంశాలు కూడా సమానంగా ఉన్నట్లు సినిమా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఈ సినిమా ట్రైలర్ చూసి, టీం కు శుభాకాంక్షలు తెలియచేసారు.

ముగ్గురు స్నేహితులు, ముగ్గురికి ఒక సమస్య, ముగ్గురు జీవితాల్లోకి జరిగిన అనుకోని సంఘటనలు, ఒక చిన్నపాప, చివరికి తమ చావుని కూడా లెక్క చెయ్యకుండా ఆ పాప జీవితం కోసం చేసిన రిస్క్.. ఇలా సినిమాలో కామెడీ మాత్రమే కాకుండా అనేక షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సుధీర్ గత చిత్రం “సాఫ్ట్ వేర్ సుధీర్” ఆశించిన మేర, విజయం సాధించకపోయినా ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.