3 మంకీస్ రివ్యూ


3 మంకీస్ రివ్యూ
3 మంకీస్ రివ్యూ

తెలుగు సినిమా ఇండస్ట్రీ కామెడీ సినిమాలలో, చాలా వరకూ సినిమాలు కామెడీ మెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం అంతర్లీనంగా ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈరోజు రిలీజ్ అయ్యి, ప్రేక్షకులను మెప్పించిన మూవీ “త్రీ మంకీస్.” జబర్దస్త్ షో తో జనాదరణ పొందిన ముగ్గురు హాస్యనటులు సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ హీరోలుగా.. ఓరుగల్లు సినీ క్రియేషన్ బ్యానర్ పై నగేష్ జి. నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు.

కథ: కథ విషయానికి వస్తే… ఫణి,ఆనంద్, సంతోష్ అనే ముగ్గురు యువకుల జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మొదట వినోదంగా మొదలై, చివరకు ఎలాంటి మలుపులు తిరిగాయి.? అనేది మెయిన్ కథ. ఇక ఒక స్పెషల్ క్యారెక్టర్ లో షకలక శంకర్ కూడా కనిపించారు. ఆ ముగ్గురి జీవితంలోకిఒక చిన్న పాప ఎవరు.? తన వల్ల అప్పటిదాకా సరదాగా సాగే వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే

విశ్లేషణ: ఆర్టిస్టుల నటన పరంగా సుధీర్, శ్రీను,రామ్ ప్రసాద్ ముగ్గురు అటు కామెడీ సీన్స్ లో తమదైన టైమింగ్ తో సూపర్ అనిపించారు. సెంటిమెంట్ సీన్స్ లో కూడా బాగా నటించారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సన్నీ గారి టేకింగ్ సినిమాకు రిచ్ నెస్ తీసుకువచ్చింది. ఫైనల్ గా డైరెక్టర్ అనిల్ ఒక మంచి ప్రయత్నం గా ఈ సినిమాను భావించవచ్చు.

రేటింగ్: 3/5