2021 సంక్రాంతికి విడుదల సినిమాలు ఇవే!

2021 సంక్రాంతికి విడుదల సినిమాలు ఇవే!
2021 సంక్రాంతికి విడుదల సినిమాలు ఇవే!

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ లో ఉండే హంగామానే వేరుగా ఉంటుంది. సంవత్సరం మొత్తానికి భారీ బిజినెస్ ఈ ఒక్క సీజన్ లోనే నడుస్తుంది. ప్రతీ సంక్రాంతికి దాదాపు 3-4 సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈసారి కూడా సంక్రాంతి రేసులో పెద్ద మార్పు ఉండకపోవచ్చు.

ప్రస్తుతం థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో ఫంక్షన్ అయ్యే అవకాశముంది. ఇరు రాష్ట్రాలు రిలీఫ్ ప్యాకేజ్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మొత్తం సినిమా రిలీజ్ ల కోసం ఎదురుచూస్తున్నాయి. 2021 సంక్రాంతికి కూడా మూడు తెలుగు సినిమాలు విడుదలవుతాయి.

రవితేజ నెక్స్ట్ సినిమా క్రాక్ జనవరి 14న విడుదలవుతోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక రానా దగ్గుబాటి అరణ్య చిత్రం కూడా జనవరి 14నే విడుదలవుతోంది. రామ్ రెడ్ కూడా సంక్రాంతికే అని అన్నారు కానీ ఈ విషయంలో స్పష్టత లేదు. విడుదల వాయిదా పడిందని కూడా అంటున్నారు.

విజయ్ నటించిన మాస్టర్ జనవరి 13న విడుదలకు కన్ఫర్మ్ అయింది. మరి ఈ 3-4 చిత్రాల విడుదలల తర్వాత టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.