`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` సెన్సార్ కంప్లీట్‌!

`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` సెన్సార్ కంప్లీట్‌!
`30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` సెన్సార్ కంప్లీట్‌!

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజుని హీరోగా ప‌రిచ‌యం చూస్తూ రూపొందుతున్న చిత్రం `30 నోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్వీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మున్నా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది. ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఓ చ‌క్క‌ని దృశ్య కావ్యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని చిత్ర బృందాన్ని సెన్సార్ స‌భ్యులు అభినందించార‌ని చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రానికి సంబంధించిన `నీలి నీలి ఆకాశం.. ` అంటూ సాగే ఓ పాట‌ని ఇటీవ‌ల సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతానికి సాహిత్య చిచ్చ‌ర‌పిడుగు చంద్ర‌బోస్ అందించిన సాహిత్యం తోడ‌వ్వ‌డంతో ఈ పాట ఎక్క‌డికో వెళ్లిపోయింది. యూట్యూబ్‌లో ఇప్ప‌టికి 50 మిలియ‌న్‌ల వ్యూస్ దాటి చిన్న చిత్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. చిన్న సినిమా, అందులో కొత్త హీరో న‌టించిన చిత్రానికి సంబంధించ‌న పాట ఈ స్థాయిలో పాపుల‌ర్ కావ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఇదే తొలిసారి. ప్రేక్ష‌కులు, సంగీత ప్రియులు ఈ పాట‌ని ఆద‌రిస్తున్నందుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌ని నిర్మాత ఎస్వీబాబు పేర్కొన్నారు.

కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్ర‌దీప్ టూ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. ఓ ఓ షేడ్‌లో మోడ్ర‌న్‌గానూ, మ‌రో షేడ్‌లో ప‌క్కా గ్రామీణ యువ‌కుడిగా పంచె క‌ట్టులో క‌నిపిస్తార‌ట‌. ఈ టూ షేడ్స్ కూడా ప్రేక్ష‌కుల‌కు అమితంగా న‌చ్చుతాయ‌ని, హీరో, హీరోయిన్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు భావోద్వేగ‌భ‌రితంగా ఆక‌ట్టుకుంటాయ‌ని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్ర‌బోస్ సాహిత్యం, దాశ‌ర‌థి శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం చిత్రానికి ప్ర‌ధాన హైలైట్స్‌గా నిలుస్తాయ‌ట‌. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.