అల్లు అర్జున్ త‌రువాత ఆ ఘ‌న‌త సాధించాడు!

అల్లు అర్జున్ త‌రువాత ఆ ఘ‌న‌త సాధించాడు!
అల్లు అర్జున్ త‌రువాత ఆ ఘ‌న‌త సాధించాడు!

అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ` సీమ‌జ వ‌ర‌గ‌మ‌నా.., `రాములో రాములా.., గీతాలు పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌లో 100 మిలియ‌న్‌ల వ్యూస్‌ని దాటి తెలుగు సినిమా పాటల్లో అథ్య‌ధిక వ్యూస్‌ని సాధించిన గీతాలుగా రికార్డు సృష్టించాయి. తాజాగా అదే రికార్డుని హీరోగా మారిన  యంక‌ర్ ప్ర‌దీప్ మాజిరాజు సినిమాలోని ఓ పాట స‌మం చేసింది.

ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. సుకుమార్ వ‌ద్ద ప‌లు క్రేజీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన మున్నా ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎస్వీబాబు నిర్మించిన ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా..`అంటూ సాగే గీతం ఇప్ప‌టికే యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సాంగ్ తాజాగా 100 మిలియ‌న్‌లు దాట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని గురిచేస్తోంది.

దీంతో అల్లు అర్జున్ త‌రువాత ఆ ఘ‌న‌త సాధించిన హీరోగా ప్ర‌దీప్ మాచిరాజు రికార్డుల కెక్కాడు. అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని చిత్ర‌బృందం మార్చి 25నే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసింది కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో ఈ సినిమా రిలీజ్ ప్ర‌శ్నార్థకంలో ప‌డిపోయింది. త్వ‌ర‌లో లాక్‌డౌన్ ముగుస్తుండ‌టంతో త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత ఎస్వీబాబు స‌న్నాహాలు చేస్తున్నాడు.