`ఆదిపురుష్‌` అప్పుడే అంత పూర్త‌యిందా?

`ఆదిపురుష్‌` అప్పుడే అంత పూర్త‌యిందా?
`ఆదిపురుష్‌` అప్పుడే అంత పూర్త‌యిందా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం `ఆది పురుష్‌`. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ 3డీ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈమూవీని రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా మోడ్ర‌న్ రామాయ‌ణంగా అత్యంత భారీ స్థాయిలో భార‌తీయ తెర‌పై క‌నీ వినీ ఎరుగ‌ని విధింగా తెర‌కెక్కిస్తున్నారు.

గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా రూపొందుతున్న ఈ మూవీలో లంకాధిప‌తి రావ‌ణ్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ముంబైలో స్టూడియోల్లో  ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌ల‌లో జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. ముంబైలో క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌ల‌న్నీ తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ సంద‌ర్భంగా `ఆదిపురుష్‌` షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే అనుకున్న స‌మ‌యానికి 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేశామ‌ని, కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని, రిలీజ్ డేట్ విష‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ స్ప‌ష్టం చేశారు. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని అవ‌తార్ త‌ర‌హాలో మోష‌న్ కాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిస్తున్నారు.