సంక్రాంతి సినిమాల లైనప్ ఇదే.. ఏకంగా 5 సినిమాలు


సంక్రాంతి సినిమాల లైనప్ ఇదే.. ఏకంగా 5 సినిమాలు
సంక్రాంతి సినిమాల లైనప్ ఇదే.. ఏకంగా 5 సినిమాలు

సంక్రాంతి అంటేనే సినిమాల హంగామా. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతికి తెలుగు సినిమాలు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఎంత లేదన్నా మూడు నుండి నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. కంటెంట్ బాగుంటే నాలుగు సినిమాలు విడుదలైనా కలెక్షన్స్ కు ఢోకా ఉండదు. అయితే ఈసారి సంక్రాంతి మరింత స్పెషల్ గా ఉండబోతోంది. నాలుగు కాదు ఏకంగా 5 సినిమాలు సంక్రాంతికి క్యూ కట్టాయి. ఆఖర్లో రేసులోకి వెంకీ మామ వచ్చిన జాయిన్ అయింది. పండగకు ఇంకా మూడు నెలలు ఉన్నా ఇప్పటికే రిలీజ్ డేట్ లను కన్ఫర్మ్ చేసేసారు ఆయా చిత్ర నిర్మాతలు. ఒకసారి ఈ ఐదు సినిమాల లైనప్ ను గమనిస్తే…

ముందుగా సంక్రాంతి సీజన్ ఈసారి డబ్బింగ్ సినిమాతో మొదలవుతుంది. రజినీకాంత్ నటించిన దర్బార్ జనవరి 10న విడుదలవుతుంది. ఇక జనవరి 12న రెండు భారీ చిత్రాలు రాబోతున్నాయి. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు జనవరి 12నే రానున్నాయి. మొదట కొంచెం గ్యాప్ తీసుకుని రావడానికి రెండు చిత్రాలు ప్రయత్నించినా సయోధ్య కుదరకపోవడంతో ఎవరూ వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. దీంతో ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోలు నటించిన చిత్రాలు రానున్నాయి.

ఇక ఈ రెండు సినిమాలు వచ్చిన రెండు రోజులకు ఇద్దరు హీరోలు కలిసి నటించిన మల్టీస్టారర్ వెంకీ మామ విడుదలవుతుంది. వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ జనవరి 14న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. వీరందరికంటే ముందు సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించిన నందమూరి కళ్యాణ్ రామ్ అందరికంటే ఆఖరున జనవరి 15న ఎంత మంచివాడవురా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఇలా మొత్తం 5 చిత్రాలతో ఈసారి సంక్రాంతి మంచి రంజుగా ఉండనుంది. మరి వీటిలో ఎన్ని చిత్రాలు విజయం సాధిస్తాయో చూడాలి.