ఒక్కరోజులోనే ‘మిస్టర్‌ మజ్ను’ ట్రైలర్‌కు 5 మిలియన్‌ వ్యూస్‌


5M views for Mr. majnu movie trailer

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ‘ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను‘. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.కాగా, ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్కరోజులోనే 5 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ట్రైలర్‌లోని కొన్ని ఫన్నీ డైలాగ్స్‌ మనల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అలాగే ‘నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ, నావల్ల ఒక్కళ్ళు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పవుతుంది’ వంటి డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి.

హీరో అఖిల్‌, హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచేలా వున్నాయి. యూత్‌ని ఆకట్టుకునే అంశాలే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించే సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. అందుకే ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ఈ సినిమాలోని ‘కోపంగా.. కోపంగా.. అనే పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు అఖిల్‌ వేసిన స్టెప్స్‌ సింప్లీ సూపర్బ్‌. ఈ పాట యూత్‌ను బాగా మెప్పిస్తుంది. ఆల్రెడీ చిత్రంలోని అన్ని పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆడియో సూపర్‌హిట్‌ అవ్వడంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయని చెప్పొచ్చు.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

English Title: 5M views for Mr. majnu movie trailer

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna