60 కోట్ల బడ్జెట్‌తో `భ‌క్త‌క‌న్న‌ప్ప‌`?


60 కోట్ల బడ్జెట్‌తో `భ‌క్త‌క‌న్న‌ప్ప‌`?
60 కోట్ల బడ్జెట్‌తో `భ‌క్త‌క‌న్న‌ప్ప‌`?

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు హీరోగా న‌టించిన చిత్రం `భ‌క్త‌క‌న్న‌ప్ప‌`. బాపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్‌గా న‌టించింది. ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మ‌ణ స్క్రీన్‌ప్లే అందించారు. 1976లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో భ‌క్త‌ర‌సాత్మ‌క చిత్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. శివలింగానికి కృష్ణంరాజు త‌న క‌ళ్ల‌ని పెట్టే స‌న్నివేశం, శివ పార‌వ‌శ్యంతో పాడే పాట‌లు ఈ సినిమాని ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌గానే నిల‌బెట్టాయి.

గ‌త మూడేళ్లుగా ఈ చిత్రాన్ని పుణఃసృస్టించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే వున్నాయి కానీ ఏవీ ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. గ‌తంలో ఇదే చిత్రాన్ని ప్ర‌స్తుత కాలానికి మార్చి సునీల్‌తో చేయాల‌ని త‌నికెళ్ల భ‌ర‌ణి ప్లాన్ చేశాడు. కానీ ఆ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. ఆ త‌రువాత అదే చిత్రాన్ని మంచు విష్ణుతో చేయాల‌నుకున్నా అది గ‌త రెండు మూడేళ్లుగా వాయిదాప‌డుతూ వ‌స్తోంది. తాజాగా మ‌ళ్లీ ఈ సినిమా వార్త‌ల్లో నిలిచింది.

ఇటీవ‌ల శ్రీ‌కాళ‌హ‌స్తి వెళ్లిన క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు `భ‌క్త‌క‌న్న‌ప్ప‌` చిత్రాన్ని నిర్మించ‌బోతున్నామ‌ని, అది త‌మ సొంత బ్యాన‌ర్‌లోనే వుంటుంద‌ని, దాదాపు 60 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం వుంటుంద‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త నాలుగేళ్లుగా రైట‌ర్స్ టీమ్‌ని ఏర్పాటు చేసి మంచు విష్ణు కొత్త‌గా క‌థ రాయిస్తున్నార‌ని. త్వ‌ర‌లోనే ఈ సినిమా తెర‌పైకి రాబోతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం ఎవ‌రు వ‌హిస్తారు? ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అనే విష‌యాల్ని మంచు విష్ణు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.