ఇంట్రడక్షన్ సీన్స్ కి 60 కోట్లా ?


RRR
RRR

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాంచరణ్ లతో పాటుగా ప్రముఖ పాత్రలైన అజయ్ దేవ్ గన్ ల ఇంట్రడక్షన్ సీన్స్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తున్నారట . ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజమే నట ! దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సన్నివేశాలను భారీ ఎత్తున ప్లాన్ చేసాడట . జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కానీ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కానీ నందమూరి , మెగా అభిమానులనే కాదు యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం ఖాయమని అంటున్నారు .

అంత బాగా డిజైన్ చేసాడట రాజమౌళి . ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు . ఇద్దరు కూడా ఎవరి పంథాలో వాళ్ళు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పోరాట యోధులు . దాంతో అంతటి మహానుభావులను ఇప్పటి తరానికి అద్భుతంగా పరిచయం చేయాలనే కసితో ఉన్నాడట జక్కన్న అందుకే భారీగా ఖర్చు పెడుతున్నాడు ఆ సీన్స్ కోసం .