పవన్ కళ్యాణ్ పై 60 కోట్ల పరువు నష్టం


60 crores defamation ceses on pawan kalyan పవన్ కళ్యాణ్ పై 60 కోట్లకు పరువు నష్టం దావా వేశారు టివి 9 అధినేత శ్రీని రాజు , ఏబీఎన్ రాధాకృష్ణ లు . నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ టివి 9 ని, ఏబీఎన్ ని , టివి 5 ని బాయ్ కాట్ చేయాలనీ ఆ ఛానళ్ల ను మెగా అభిమానులు చూడొద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే . తెలుగుదేశం పార్టీ కి వత్తాసు గా ఉన్న ఈ చానళ్ళు మెగా కుటుంబాన్ని అందునా నన్ను టార్గెట్ చేశాయని అందుకే వాటిని చూడొద్దని పవన్ ట్వీట్ చేసాడు .

దాంతో సదరు మీడియా చానళ్ళు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ పై కోపంగా ఉన్న సదరు ఛానళ్ల యజమానులు 60 కోట్ల పరువు నష్టానికి దావా వేసాయి . టివి 9 అధినేత శ్రీనిరాజు 50 కోట్ల పరువు నష్టం దాఖలు చేయగా ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం 10 కోట్లకు పరువు నష్టం దావా వేసాడు . ఈ రెండు దావా ల వల్ల పవన్ కళ్యాణ్ కు కొంత ఇబ్బందే ! అయితే రాజకీయంగా పవన్ వీటిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి .