68 కోట్ల లాభాలను తెచ్చిన విజయ్ దేవరకొండ


68 crores profit geetha govindam

చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం ప్రభంజనం సృష్టించింది . కేవలం 18 కోట్ల బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి 68 కోట్ల లాభాలు వచ్చి పడ్డాయి . ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్లు అందరికీ భారీ లాభాలు వచ్చాయి దాంతో ఇప్పటివరకు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ లలో నెంబర్ వన్ గా నిలిచింది గీత గోవిందం చిత్రం . 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం చిత్రానికి 18 కోట్ల బిజినెస్ జరిగింది . దాంతో అందరికీ భారీ లాభాలు వచ్చాయి . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ఈ సినిమాతో రెట్టింపు అయ్యింది .

పరశురాం దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ సరసన రాష్మిక మందన్న నటించింది . విజయ్ – రష్మిక ల జోడి కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని 68 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది . ఆగస్ట్ 15 న విడుదలైన గీత గోవిందం తన బిజినెస్ ని క్లోజ్ చేసింది . వరుసగా చిత్రాలు విడుదల అవుతుండటంతో గీత గోవిందం చిత్రాన్ని లేపేసారు . కనక వర్షం కురిపించడంతో మొత్తానికి గీత గోవిందం బృందం చాలా సంతోషంగా ఉంది .

English Title: 68 crores profit geetha govindam