7 కోట్ల నష్టాన్ని మిగిల్చిన డియర్ కామ్రేడ్


7 crores Loss for Dear Comrade Buyers
7 crores Loss for Dear Comrade Buyers

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండరష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మొత్తానికి బయ్యర్లకు 7 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . జూలై 26 న దక్షిణాది లోని నాలుగు భాషల్లో ఎంతో అట్టహాసంగా విడుదలైన డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ ని భారీ దెబ్బ కొట్టింది . ఈ చిత్రంతో సౌత్ లో తన మార్కెట్ ని పెంచుకోవాలని చూసాడు కానీ ఆ ఆశలన్నీ తల్లకిందులయ్యాయి . దాంతో షాక్ అవ్వడం ఈ హీరో వంతు అయ్యింది .

డియర్ కామ్రేడ్ చిత్రం భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కింది , ఈ సినిమా బాగున్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉండటంతో మిస్ ఫైర్ అయ్యింది , అప్పటికి 13 నిమిషాలు తొలగించారు కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది . రెండున్నర గంటల్లోపే సినిమా ఉంటే ఖచ్చితంగా మరోలా ఉండేది కానీ తెలిసి తెలిసి సినిమా నిడివి ఎక్కువ ఉంచి దెబ్బతిన్నారు . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది .