70 కోట్ల బడ్జెట్ అంటే రిస్క్ చేయడమే


70 crores budjet for balakrishna and boyapati

బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి 70 కోట్ల బడ్జెట్ తో అంచనాలు వేసాడట దర్శకులు బోయపాటి దాంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది . బాలకృష్ణ బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి దాంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే 70 కోట్ల బడ్జెట్ అంటే మాత్రం పెద్ద మొత్తంలో రిస్క్ .

 

బాలకృష్ణ ఇంతవరకు వంద కోట్ల వసూళ్ల ని రాబట్టలేక పోయాడు , తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం 20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది . 50 కోట్ల షేర్ వసూల్ చేయడమే గగనం అవుతున్న ఈ కాంబినేషన్ లో 70 కోట్ల బడ్జెట్ అంటే రిస్క్ అనే చెప్పాలి . పైగా బోయపాటి దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యింది . ఆ రకంగా చూసుకున్నా భారీ బడ్జెట్ అన్నది ఈ కాంబినేషన్ కు పెద్ద పెద్ద రిస్క్ .

 

English Title: 70 crores budjet for balakrishna and boyapati