క‌రోనా ఎఫెక్ట్‌: క‌పిల్‌దేవ్ బ‌యోపిక్ రిలీజ్ వాయిదా!క‌రోనా ఎఫెక్ట్‌: క‌పిల్‌దేవ్ బ‌యోపిక్ రిలీజ్ వాయిదా!
క‌రోనా ఎఫెక్ట్‌: క‌పిల్‌దేవ్ బ‌యోపిక్ రిలీజ్ వాయిదా!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా (కోవిడ్‌-19) వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. దీన్ని అరిక‌ట్టేందుకు దేశాల‌న్నీ నివార‌ణ చ‌ర్య‌లు చేస‌ట్టాయి. దేశంలో దీని ప్ర‌భావం ఉదృతం కావ‌డంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా జాగ్ర‌త్త చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించాయి. దేశ వ్యాప్తంగా అల‌ర్ట్‌ని ప్ర‌క‌టించాయి. క‌రోనాని నిరోధించే క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీలో కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చింది. షూటింగ్‌ల‌ని రద్దు చేయ‌డంతో పాటు రిలీజ్‌ల‌ని కూడా వాయిదా వేస్తోంది.

ఈ క్ర‌మంలో స్టార్స్ న‌టించిన క్రేజీ చిత్రాలు, భారీ చిత్రాలు కూడా విడుద‌ల‌ని వాయిదా వేస్తున్నాయి. ఈ కోవ‌లో క‌పిల్‌దేవ్ బ‌యోపిక్ ఆధారంగా రూపొందిన `83` చిత్ర రిలీజ్‌న వాయిదా వేశారు. ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర బృందం శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. `క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని `83` చిత్ర విడుద‌ల‌ని వాయిదా వేస్తున్నాం. ప‌రిస్థితులు మెరుగుప‌డిన త‌రువాత మ‌ళ్లీ విడుద‌ల తేదీ గురించి ఆలోచిస్తాం` అని వెల్ల‌డించింది.

ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని ఎదుర్కొని విజ‌యం సాధించ‌డ‌మే `83` చిత్ర ముఖ్య ఉద్దేశం. ప్ర‌స్తుతం వున్న ప్ర‌తీకూల ప‌రిస్థితుల్ని ఎదుర్కోని మ‌నం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని ఆశిస్తున్నాం అని వెల్ల‌డించారు. 1983లో సాధార‌ణ జ‌ట్టుగా బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టుని డేర్ డెవిల్స్‌గా మార్చి తొలి వ‌ర‌ల్డ్ క‌ప్‌ని దేశానికి అందించిన ఘ‌న‌త క‌పిల్‌దేవ్‌ది. ఇదే క‌థాంశంతో `83` చిత్రాన్ని తెర‌కెక్కించారు. ర‌ణ్‌వీర్‌సింగ్ క‌పిల్‌దేవ్ పాత్ర‌లో న‌టించారు.