`83`లో దీపికా ప‌దుకోన్ లుక్ వ‌చ్చేసింది!

`83`లో దీపికా ప‌దుకోన్ లుక్ వ‌చ్చేసింది!
`83`లో దీపికా ప‌దుకోన్ లుక్ వ‌చ్చేసింది!

1983.. ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ ఇయ‌ర్‌కు ప్ర‌త్యేక స్థానం వుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా భ‌ర‌త్ నుంచి ప్ర‌పంచ క‌ప్‌లోకి ఎంట‌రైన క‌పిల్ జ‌ట్టు ఆ త‌రువాత డేర్ డెవిల్స్‌గా అవ‌తరించి భార‌త్ చిర‌కాల స్వ‌స్న‌మైన వ‌ర‌ల్డ్ క‌ప్‌ని తొలిసారి ఇండియాకు అందించి చ‌రిత్ర సృష్టించింది. ఈ క్ర‌మంలో క‌పిల్‌దేవ్ కెప్టెన్‌గా ఎలాంటి ఒత్త‌డికి లోన‌య్యాడు. ఎలాంటి ఎత్తులు వేశాడు? త‌న‌తో జ‌ట్టు స‌భ్య‌లంతా ఎలా పోరాడి భార‌త్‌కు చిర‌స్మ‌ర‌నీయ‌మైన విజ‌యాన్ని అందించార‌న్న క‌థాంశంతో `83` చిత్రం రూపొందుతోంది.

క‌బీర్‌ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఫాంట‌మ్ పిలింస్‌, విష్ణు ఇందూరి, క‌బీర్‌ఖాన్‌, దీపికా ప‌దుకోన్‌, సాజిద్ న‌దియావాలా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌సింగ్‌, ఆయ‌న భార్య రోమి భాటియాగా దీపికా ప‌దుకోన్ న‌టిస్తున్నారు. తాజాగా త‌న ఫ‌స్ట్‌ లుక్ కు సంబంధించిన ఓ ఫొటోని స్వ‌యంగా దీపికా ప‌దుకోన్ సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా బుధ‌వారం రిలీజ్ చేసింది. పాత్ర చిన్న‌దే అయినా భార‌తీయ క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయిన మ‌ర్చిపోలేని ఘ‌ట్టానికి సంబంధించిన చిత్రంతో తానూ ఓ భాగం కావ‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాన‌ని దీపిక పేర్కొంది.

ఓ భర్త వృత్తి ప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా స‌క్సెస్‌ని చూసిన ఓ భార్య‌గా తాను ఈ చిత్రంలో న‌టించాన‌ని. త‌న భ‌ర్త విజ‌యాన్ని కోరుకునే ప్ర‌తి మ‌హిళ‌కు త‌న పాత్ర అంకిత‌మ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది. 83 చ‌రిత్ర‌ని మ‌రోసారి నేటి త‌రానికి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌బోతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Credit: Twitter