వరంగల్ లో మరో గ్యాంగ్ రేప్


వరంగల్ లో మరో గ్యాంగ్ రేప్
వరంగల్ లో మరో గ్యాంగ్ రేప్

కేవలం అయిదు రోజుల క్రితమే చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ప్రవీణ్ అనే నరరూప రాక్షసుడికి వరంగల్ కోర్టు ఉరిశిక్ష వేసిందని చంకలు గుద్దుకుంటున్న సమయంలోనే మరో అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది దాంతో పెను సంచలనమే అయ్యింది . 9 వ తరగతి చదువుతున్న బాలిక పై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడం సంచలనం సృష్టించింది .

తనపై అత్యాచారం జరగడంతో తీవ్ర అవమానంగా భావించిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది . హన్మకొండ లోని సమ్మయ్య నగర్ కు చెందిన మైనర్ బాలిక ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది . దాంతో కేసు ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు . దేశంలో రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి . ఇటీవలే 9 నెలల చిన్నారి పై జరిగిన అత్యాచారం , హత్య మరువక ముందే మరో మైనర్ బాలికపై అత్యాచారం జరగడం , ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో మానవత్వం మంటగలిసి పోతోందని , అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు .