కూతురు లైవ్ వీడియోలోకి ఫాద‌ర్ ఎంట్రీ!

కూతురు లైవ్ వీడియోలోకి ఫాద‌ర్ ఎంట్రీ!
కూతురు లైవ్ వీడియోలోకి ఫాద‌ర్ ఎంట్రీ!

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. బాయ్ ఫ్రెండ్ కార‌ణంగా ఆ మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారిన ఐరా ఆ త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ ఫొటో షూట్‌ల‌తో వైర‌ల్‌గా మారింది. తాజాగా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అంతా ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టారు. ఇదే క్ర‌మంలో ఐరా ఖాన్ కూడా ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకుంటోంది.

ఆన్ లైన్ లైవ్‌లో ఫిట్ నెస్ ట్రైన‌ర్ డేవిడ్ తో క‌లిసి యోగాస‌నాలు వేస్తోంది.  `ధూమ్ 3, పీకే చిత్రాల కోసం ఫిజిక‌ల్ ట్రైన‌ర్ డేవిడ్ వ‌ద్దే అమీర్‌ఖాన్ ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకున్నారు. అత‌నే ప్ర‌స్తుతం అమీర్‌ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్‌కి ఆన్ లైన్ వేదిక‌గా యోగా పాఠాలు నేర్పుతున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటి ప‌ట్టునే వుంటున్న ఐరా ఖాన్ గ‌త కొన్ని రోజులుగా డేవిడ్ వ‌ద్ద ఆన్ లైన్ ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకుంటోంది.

తాజాగా  ఐరా డేవిడ్‌తో క‌లిసి ఆన్ లైన్ యోగా చేస్తుండ‌గా లైవ్‌లోకి అమీర్‌ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మీరు కూడా యోగాలో జా‌యిన్ అవుతారా అంటూ డేవిడ్ ప్ర‌శ్నించ‌డంతో తాను హాయ్ చెప్ప‌డానికి మాత్ర‌మే వ‌చ్చాన‌ని బ‌దులిచ్చి అమీర్‌ఖాన్ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా వుంటే అమీర్‌ఖాన్ ఇంటిలో ప‌ని చేస్తున్న వారికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. తాజాగా అమీర్ త‌ల్లికి కూడా క‌రోనా టెస్టులు చేయించారు. ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ రావ‌డంతో అమీర్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు.