యూట్యూబ్ బంపర్ హిట్ అయ్యింది


A AA hindi dubbing movie ruling in youtubeసమంతనితిన్ జంటగా నటించిన ” అ …. ఆ ” చిత్రం తాజాగా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది . 2016 లో విడుదలైన ఈ చిత్రం బంపర్ హిట్ అయ్యింది . నితిన్ ని యాభై కోట్ల క్లబ్ లో చేర్చిన మొదటి చిత్రం అ ఆ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కృష్ణ – విజయనిర్మల నటించిన మీనా సినిమాని తలపించేలా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎందుకంటే యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా అప్పటి మీనా రూపొందగా దాదాపుగా అదేకథ ని స్వల్ప మార్పులతో అ ఆ ని రూపొందించాడు త్రివిక్రమ్ అయితే టైటిల్స్ కార్డ్స్ లో ఆ క్రెడిట్ యద్దనపూడి కి ఇవ్వకపోవడంతో విమర్శలు వచ్చాయి దాంతో త్రివిక్రమ్ క్షమాపణ చెప్పఁడంతో అప్పటికి అది సద్దుమణిగింది .

ఇక ఆ విషయాన్నీ పక్కన పెడితే ఇటీవలే అ ఆ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టేసారు . తక్కువ సమయంలోనే 52 మిలియన్లు పైగా వ్యూస్ సాధించింది . ఇదంతా సమంత , త్రివిక్రమ్ ల వల్లే అంటూ అప్పుడే చెప్పుకొస్తున్నారు పలువురు నెటిజన్లు . మొత్తానికి ఓ సూపర్ హిట్ చిత్రానికి అందునా హిందీలో చేసిన చిత్రానికి భారీ స్థాయిలో వ్యూస్ రావడం గొప్పే !

English Title: A AA hindi dubbing movie ruling in youtube