గ‌ణేష్ ఆచార్య‌పై మీటూ ఆరోప‌ణ‌లు!A complaint filed against Ganesh Acharya
A complaint filed against Ganesh Acharya

త‌ను శ్రీ ద‌త్తా బాలీవుడ్‌లో సృస్టించి మీటూ ప్ర‌కంప‌న‌లు అంతా ఇంతా కాదు. విల‌క్ష‌ణ న‌టుడు నానా ప‌టేక‌ర్‌నే ఈ వివాదంలోకి లాగ‌డంతో దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఎంతో మంది మీటూ వివాదం కార‌ణంగా త‌మ దాకా వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ని వదులు కోవాల్సి వ‌చ్చింది. ఈ వివాదం స‌ద్దుమ‌నిగింది అనుకుంటున్న త‌రుణంలో తాజాగా మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు మొద‌లుపెట్టింది.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మ‌హిళ‌ను పోర్న్ వీడియోలు చూడ‌మంటూ గ‌ణేష్ ఆచార్య గత కొంత కాలంగా వేధిస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని స‌ద‌రు మ‌హిళ జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌కు వెల్ల‌డించ‌డంతో గ‌ణేష్ ఆచార్య‌పై ముంబైలోని అంబోలీ పోలీస్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజా సంఘ‌న‌కు మ‌రో సీనిమ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్‌ఖాన్ కూడా తోడై గ‌ణేష్ ఆచార్య‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింత ర‌చ్చ‌గా మారింది. గ‌ణేష్ ఆచార్య త‌న వ‌ద్ద ప‌నిచేసే డ్యాన్స‌ర్‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని, త‌న ప‌లుకుబ‌డితో వారిపై ఒత్తిడి తీసుకొచ్చేవాడ‌ని, త‌న‌పై కంప్లైంట్ చేస్తే డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ నుంచి త‌ప్పిస్తాన‌ని బెదిరించిన సంద‌ర్భాలు చాలానే వున్నాయ‌ని స‌రోజ్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఆరోప‌ణ‌ల‌పై గ‌ణేష్ ఆచార్య మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు.