స‌మంత‌కు షాకిచ్చిన అభిమాని!


స‌మంత‌కు షాకిచ్చిన అభిమాని!
స‌మంత‌కు షాకిచ్చిన అభిమాని!

అభిమానం హ‌ద్దులు దాట‌నంత వ‌ర‌కే.. అదే హ‌ద్దులు దాటితే అన‌ర్థం జ‌రుగుతుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఓ అభిమాని చేసిన ప‌ని స‌మంత‌కు షాక్‌కు గురిచేసింది. స‌మంత న‌టిస్తున్నతాజా చిత్రం `జాను`. శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్నారు. త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన `ఊహ‌లే ఊహ‌లే…` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాట వైర‌ల్ కావ‌డంతో ఓ అభిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ప‌ని సామ్‌ని షాక్‌కు గురిచేసింది. `ఐ ల‌వ్ యూ జాను` అంటూ 3 గంట‌ల 15 నిమిషాల పాటు రామ కోటి రాస్తున్న‌ట్టుగా జాను నామ‌స్మ‌ర‌ణ చేస్తూ జాను కోటి రామ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

త‌న త‌ల్లి మంద‌లించిన ప‌ట్టువ‌ద‌ల‌కుండా రాశాన‌ని, గోష్ అనే అభిమాని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. దీనికి స‌మంత `ఓ గోష్ మీ అమ్మ నాపై కోపంగా వున్న‌ట్టున్నారు. నాపై ఈ స్థాయిలో ప్రేమ‌ని కురిపించినందుకు థాంక్స్. కానీ నా వ‌ల్ల నీ స్ట‌డీస్‌కి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకో అని ట్వీట్ చేయ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు.

Credit: Twitter