ఎఫ్3పై మరో కొత్త రూమర్… ఈసారి ఫిక్స్ అంటున్నారే!

ఎఫ్3పై మరో కొత్త రూమర్... ఈసారి ఫిక్స్ అంటున్నారే!
ఎఫ్3పై మరో కొత్త రూమర్… ఈసారి ఫిక్స్ అంటున్నారే!

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. కామెడీ చిత్రాలతో టాప్ దర్శకుడిగా నిలిచిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో కథానాయికలుగా తమన్నా, మెహ్రీన్ లు నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఎఫ్2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఎఫ్3 సినిమాపై బోలెడన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎఫ్2లో పూర్తి స్థాయి కామెడీ అంశాన్ని ఎత్తుకున్న అనిల్ రావిపూడి, ఈసారి డబ్బుని ప్రధానాస్త్రంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ప్రకారం ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక స్పెషల్ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఆ స్పెషల్ పాత్ర పూర్తి కన్ఫ్యూజన్ తో మొదలై ఫుల్ కామెడీని పంచుతుందని సమాచారం. ఏదేమైనా ఈ పాత్ర గురించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది.