`A1 ఎక్స్‌ప్రెస్` చివ‌రి ఆ సీన్స్ హైలైట్ అంటున్నారే!

`A1 ఎక్స్‌ప్రెస్` చివ‌రి ఆ సీన్స్ హైలైట్ అంటున్నారే!
`A1 ఎక్స్‌ప్రెస్` చివ‌రి ఆ సీన్స్ హైలైట్ అంటున్నారే!

హీరో సందీప్ కిషన్ న‌టిస్తున్న 25 వ చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`.  హాకీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న మొట్ట మొదటి తెలుగు చిత్రమిదే కావ‌డం విశేషం. డెన్నిస్ జీవన్ కనుకోలను దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ ఈ మూవీ ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సందీప్‌కి జోడీగా ఇందులో లావణ్య త్రిపాఠి న‌టిస్తోంది.

క్రీడ‌ల్లోకి కార్పొరేట్ శ‌క్తులు ఎంట‌రైన ద‌గ్గ‌రి నుంచి స్పోర్ట్స్ , స్పోర్ట్స్ మెన్స్ ఎలా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారో ఈ మూవీ ద్వారా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ట్రైల‌ర్ లో స్ప‌ష్ట‌మైంది. రావు ర‌మేష్ పాత్ర చేత చెప్పించిన డైలాగ్‌లే ఇందుకు అద్దంప‌డుతున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని చివరి 24 నిమిషాలు ప్రధాన హైలైట్ అవుతాయని తెలుసుస్తోంది.

ఈ స‌న్నివేశాల్ని పంజాబ్ మొహాలి స్టేడియంలో షూట్ చేశార‌ట‌. ఈ కీల‌క  హాకీ మ్యాచ్  ఎపిసోడ్ కోసం సుమ కనకల వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి హిప్ అప్ తమిళ‌ సంగీతం అందించారు.  ఈ చిత్ర గీతాల‌కు మంచి స్పందన ల‌భిస్తోంది. కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో సందీప్ కిష‌న్ ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మార్చి 5 న ఈ చిత్రం విడుదల కానుంది.