ఆ సినిమా వాయిదా పడటానికి పెద్ద డ్రామా ఆడారట


aachari america yatra facing release problemsఈనెల 5న నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజున అంటే ఏప్రిల్ 6న మంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర విడుదల కావాల్సి ఉండే కానీ నితిన్ సినిమా ఒకరోజు ముందుగా విడుదల అవుతుండటంతో థియేటర్ ల సమస్య వస్తుందని తెరవెనుక పెద్ద మంత్రాంగం నడవడంతో మంచు విష్ణు సినిమాని వాయిదా పడేలా చేశారట . ఇప్పటికే రంగస్థలం చిత్రం పెద్ద హిట్ కావడంతో థియేటర్ ల కొరత ఉంది దానికి తోడు నితిన్ సినిమా కోసం మరిన్ని థియేటర్ లు బుక్ అయిపోవడంతో చేసేది లేక ఆచారి అమెరికా యాత్ర వాయిదా వేసారట .

 

ఈ డ్రామా ఆడటంలో పలువురు సినీ ప్రముఖులు తెరవెనుక పెద్ద మంత్రాగం నడిపించారట , అందులో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నాడట . మొత్తానికి మంచు విష్ణు తప్పుకోవడంతో నితిన్ కు లైన్ క్లియర్ అవుతోంది . ఇక చల్ మోహన్ రంగ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి ఇన్ని మతలబు ల తర్వాత .