తండ్రి, బాబాయి లాగానే తెలుగులో అబ్బాయికి కష్టం గానే ఉంది


Operation Gold Fish Trailer
Operation Gold Fish Trailer

ఆది సాయికుమార్ తెలుగు పరిశ్రమకి ‘ప్రేమ కావలి’ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. తండ్రి ‘సాయి కుమార్’ ఆశీస్సులతో అడుగు పెట్టిన కొడుకుకి మొదటి రెండు సినిమాలు మంచి ఫలితాలని ఇచ్చాయి. తరువాత సినిమాలు అన్ని బోల్తా కొట్టాయి. చూస్తుంటే తండ్రి సాయి కుమార్ మరియు బాబాయి రవి శంకర్ లాగానే అబ్బాయికి తెలుగులో అవకాశాలు తగ్గే సూచనలు ఉన్నాయి.

ఈ సంవత్సరంలో ఇప్పటికి ‘జోడి’, ‘బుర్ర కథ’ అని రెండు సినిమాలని దించిన ఆది ఫెయిల్ అయ్యాడు. ఆ రెండు సినిమాలు 2 రోజులకే ఇంటికి వెళ్లిపోయాయి. సినిమాలు చూసిన జనం కూడా అదే అనుకుంటున్నారు తండ్రి, బాబాయి లాగానే అయిపోతారని. కానీ చూస్తుంటే ఆది మాత్రం వరుస ఆఫర్లని రాబట్టుకుంటున్నాడు. జనాలు ఏమో సినిమాలు చేయడం కాదు, సినిమా హిట్ అయ్యే కథలని ఎంచుకొమ్మని చెబుతున్నారు.

ఈ ఏడాది విడుదల అవుతున్న ఇంకొక సినిమా “ఆపరేషన్ గోల్డ్ ఫిష్” మీదనే అబ్బాయి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ట్రైలర్ చూస్తే కూడా టెర్రరిజమ్, కాశ్మీరీ జీవితాల నేపథ్యంలో అల్లుకున్న కథ అని తెలిసిపోతుంది. సినిమా పోస్టర్ దగ్గర నుండి అన్నింటిని పెద్ద సెలెబ్రెటీస్ తో ఓపెన్ చేపిస్తున్న సినిమా యూనిట్ వాళ్ళు ట్రైలర్ ని కూడా ఇంకొక పెద్ద సెలెబ్రెటీస్ తో రిలీజ్ చూపిద్దాం అనుకుంటున్నారు.

అనుకున్నట్టు గానే ట్రైలర్ ని ‘అక్కినేని నాగార్జున’ చేతుల మీదుగా రిలీజ్ చేపించారు. ట్రైలర్ చూస్తుంటే కథ కంటే కథనం ఎక్కువ అనిపిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ ఫ్లాప్ సినిమాల నుండి బయట పడతారు అనే మాట తక్కువే అని చెప్పాలి. ఒకవేళ సినిమా రిసల్ట్ బాగుంటే తప్ప ఇప్పుడేం చెప్పలేం.