ఆరెక్స్ 100 బ్యూటీతో ఆది కిరాతిక

ఆరెక్స్ 100 బ్యూటీతో ఆది కిరాతిక
ఆరెక్స్ 100 బ్యూటీతో ఆది కిరాతిక

సినిమాల పరంగా పూర్తిగా మార్కెట్ కోల్పోయాడు ఆది. తన లాస్ట్ రిలీజ్ శశికి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ పడినా అది  సినిమాను హిట్ చేయలేకపోయింది. అయితే మార్కెట్ కోల్పోయినా కానీ సినిమా అవకాశాల పరంగా లోటేం లేదు. ఆది సాయి కుమార్ రీసెంట్ గా రెండు సినిమాలను కన్ఫర్మ్ చేసాడు. అందులో ఒకటి కిరాతిక.

ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో  హీరోయిన్ గా నటిస్తోంది. వరసగా సినిమాల ఎంపికలో తప్పులు చేసిన పాయల్ తన కెరీర్ ను దెబ్బతీసుకుంది. ఇప్పుడామె ఆశలన్నీ ఈ కిరాతిక పైనే ఉన్నాయి. టైటిల్ చూస్తేనే అర్ధమవుతోందిగా ఇది ఒక థ్రిల్లర్ అని.

పూలరంగడు వంటి విజయవంతమైన చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు వీరభద్రం ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. నాగం తిరుపతి నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కుతోంది.