రామ్ సినిమాలో విలన్ గా ఆది కన్ఫర్మ్ అయ్యాడుగా

రామ్ సినిమాలో విలన్ గా ఆది కన్ఫర్మ్ అయ్యాడుగా
రామ్ సినిమాలో విలన్ గా ఆది కన్ఫర్మ్ అయ్యాడుగా

ఉస్తాద్ రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రెడ్ యావరేజ్ తో సరిపెట్టుకోవడంతో రామ్ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు లింగుసామితో కలిసి సినిమా చేస్తున్నాడు రామ్. ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. దీని షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగం సాగుతోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఆది గతంలో సరైనోడు చిత్రంలో విలన్ గా చేసాడు. దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి విలన్ గా ఏ మేరకు ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.