ఆర్ ఎక్స్ 100 తమిళ్ హీరో ఎవరో తెలుసా


aadi pinisetty to remake RX100 in tamil

తెలుగునాట గత నెలలో విడుదలై సంచలన విజయం సాధించిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఇప్పుడు తమిళ్ లో రీమేక్ అవుతోంది . తెలుగులో సూపర్ హిట్ కావడంతో రీమేక్ కోసం పలువురు పోటీ పడ్డారు . కాగా ఆది పినిశెట్టి భారీ ఆఫర్ ఇచ్చి తమిళ హక్కులు సొంతం చేసుకున్నాడు . అయితే ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ గా ఉన్నందున రీమేక్ కొంత సమయం పట్టేలా ఉంది , దాంతో తమిళ సినిమాకు కూడా మీరే దర్శకత్వం వహించాలని ఈలోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయండని దర్శకులు అజయ్ భూపతి ని కోరాడట ఆది పినిశెట్టి .

అయితే ఆది ఆఫర్ ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడట అజయ్ భూపతి , ఎందుకంటే ఆ దర్శకుడికి తమిళ్ రాదు కాబట్టి భాష రాకుండా డైరెక్షన్ చేయడం బాగుండదని అందుకే నో చెప్పాడట ! దాంతో ఆర్ ఎక్స్ 100 కి డైరెక్టర్ ని వెతుక్కునే పనిలో పడ్డాడు ఆది . తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు ఆది . అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ హీరో .

English Title: aadi pinisetty to remake RX100 in tamil