ఆది పినిశెట్టి హీరోయిన్‌తో ప్రేమ‌లో వున్నారా?


ఆది పినిశెట్టి హీరోయిన్‌తో ప్రేమ‌లో వున్నారా?
ఆది పినిశెట్టి హీరోయిన్‌తో ప్రేమ‌లో వున్నారా?

విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో తన ‌దైన మార్కుని సృష్టించుకున్న యువ హీరో ఆది పినిశెట్టి. `స‌రైనోడు` చిత్రంలో వైర‌మ్ ధ‌నుష్ పాత్ర‌లో విల‌న్‌గా ఆక‌ట్టుకున్నారు. హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి గ‌త కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గ‌ల్రానితో డేటింగ్‌లో వున్న‌ట్టు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపించాయి. ఆ వార్త‌ల‌పై ఆది స్పందించ‌లేదు.

నిక్కీ గ‌ల్రానీ, ఆది క‌లిసి 2017లో వ‌చ్చిన `మ‌ర‌క‌త‌మ‌ణి` చిత్రంలో న‌టించారు. అప్ప‌టి నుంచే ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఏర్ప‌డింద‌ని, ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించ‌డం మొద‌లైంది. ఇటీవ‌ల ఆది పినిశెట్టి ఫాద‌ర్‌, ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి బ‌ర్త్‌డే వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆది కుటుంబ స‌భ్యులు త‌ప్ప మ‌రెవ‌రూ క‌నిపించ‌లేదు. ఫ్యామిలీ ఫంక్ష‌న్‌గా జ‌రుపుకున్న ఈ బ‌ర్త్‌డే పార్టీలో నిక్కీ గ‌ల్రానీ మాత్రం క‌నిపించ‌డంతో వీరి మ‌ధ్య రిలేష‌న్ నిజ‌మ‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది.

ఆది పినిశెట్టి కూడా త‌మ రిలేష‌న్ ని బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డించాల‌ని చూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని త‌మిళ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. చెన్నైలో లాక్‌డౌన్ న‌డుస్తున్న వేళ నిక్కీ గ‌ల్రానీ ఆది ఫ్యామిలీతో వుందంటే అర్థం చేసుకోవ‌చ్చని త‌మిళ జ‌నం అంటున్నారు. నిక్కీ గ‌ల్రానీ `బుజ్జిగాడు` ఫేమ్ సంజ‌న గ‌ల్రానీ సోద‌రి అన్న విష‌యం తెలిసిందే.