బుర్రకథ తోనైనా హిట్ కొడతాడా ?


బుర్రకథ తోనైనా హిట్ కొడతాడా ?
ఆది సాయి కుమార్

సాయికుమార్ తనయుడిగా హీరోగా తెరంగేట్రం చేసాడు ఆది సాయి కుమార్ . ప్రేమకావాలి అంటూ వచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు , దాని తర్వాత లవ్లీ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ హిట్ అంటే ఏంటో తెలీదు పాపం ఈ హీరోకు . అయినా ఏడేళ్లుగా నెట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు . పదేళ్ల కెరీర్ లో కేవలం రెండంటే రెండు మాత్రమే హిట్స్ మిగతావన్నీ అట్టర్ ప్లాప్ చిత్రాలు దాంతో ఆది సాయికుమార్ రేసులో లేకుండాపోయాడు .

కట్ చేస్తే ఇప్పుడు బుర్రకథ అంటూ వస్తున్నాడు ఆది సాయికుమార్ . ఇన్నాళ్లు డైలాగ్స్ రాసిన డైమండ్ రత్నం బుర్రకథ చిత్రంతో దర్శకుడిగా మారాడు . ఈరోజు బుర్రకథ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో . ఎంటర్ టైన్ మెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ బుర్రకథ తో హిట్ కొడతాడా ? మళ్ళీ గాడిలో పడతాడా ? డైమండ్ రత్నం దర్శకుడిగా సక్సెస్ అవుతాడా ? అన్నది తెలియాలంటే బుర్రకథ రిలీజ్ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే .