వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఫిక్షనల్ ఫిల్మ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ – సాయి కిరణ్ అడివి


aadi saikumar confident on operation gold fish result
aadi saikumar confident on operation gold fish result

కెరీర్ పరంగా ఆది సాయి కుమార్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. కథల ఎంపికలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల గత కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఆది మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఉన్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రాన్ని చేసాడు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

మాటల రచయితగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మాటలు అందించిన అబ్బూరి రవి, ఈ చిత్రాన్ని రచించడమే కాకుండా ఘాజీ బాబా పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే విభిన్న చిత్రాలకు ఆదరణ బాగుండడంతో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రస్తుతం రగులుతోన్న కశ్మీరీల సమస్యలపై ఈ చిత్రంలో చర్చించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మొదటిసారి ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం విశేషం. ఆది సాయికుమార్ తో పాటు నిత్యా నరేష్, మనోజ్ నందం, అబ్బూరి రవి, శ‌షా చెట్రి, అనీష్, కృష్ణుడు, రావు రమేష్ తదితరులు నటించారు. ఇలాంటి చిత్రాలకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే దిట్ట శ్రీచరణ్ పాకల ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రానికి కూడా అదిరిపోయే రేంజ్ లో ఔట్పుట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ పాజిటివ్ గా ఉన్న ఈ చిత్రంతోనైనా ఆది హిట్ అందుకుని ట్రాక్ లో పడతాడేమో చూడాలి.