రామ్ కోసం పవర్ఫుల్ విలన్ రెడీ

రామ్ కోసం పవర్ఫుల్ విలన్ రెడీ
రామ్ కోసం పవర్ఫుల్ విలన్ రెడీ

ఇస్మార్ట్ శంకర్, రెడ్ చిత్రాల తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. అందుకోసమే తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ ద్విభాషా చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. వారం రోజుల నుండి చెన్నైలో షూట్ సాగుతోంది. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమా సెట్స్ కు వచ్చి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు కూడా.

కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకీ ఈ సినిమాలో విలన్ ఎవరు అంటే దానికి కూడా సమాధానం దొరికేసింది. ఈ చిత్రంలో విలన్ గా ఆది నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆది గతంలో సరైనోడు చిత్రంలో విలన్ గా నటించాడు. అది సూపర్ గా వర్కౌట్ అయింది. రంగస్థలంలో పాజిటివ్ రోల్ చేసాడు.

ఇప్పుడు మరోసారి విలన్ అవతారం ఎత్తుతున్నాడు. లింగుసామి ఆది పాత్రను చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేసాడట. ఈ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.