ఆకాష్ పూరి కొత్త చిత్రం ఎప్పుడంటే?


aakash puri
aakash puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి నటించే కొత్త చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.. మెహబూబా చిత్రం తరువాత ఆకాష్ నటిస్తున్న చిత్రం ఇది.

లవర్ బాయ్ గా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆకాష్ నటుడిగా మంచి మార్కులు సంపాదించినా ఆ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. తన తండ్రి పూరి జగన్నాద్ స్వీయ దర్శకత్వంలో మెహబుబా రూపొందింది.

ఆ సినిమా తరువాత ఆకాష్ కొంత బ్రేక్ తీసుకొని ఇప్పుడు ఓ సరికొత్త కథతో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి మల్లికార్జున్(మల్లి) దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈయన కళ్యాణ్ రామ్ తో కత్తి సినిమా చేసాడు..

ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా టెక్నికల్ గా దర్శకుడు మల్లి కి బాగా పేరొచ్చింది. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తరువాత మల్లి ఆకాష్ పూరితో విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమా తీయబోతున్నాడు.. బెంగళూరు కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మంజునాథ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు..