ఆమె రివ్యూ


Aame Review
Aame Review

నటీనటులు : అమలా పాల్ , రమ్య సుబ్రహ్మణ్యన్
సంగీతం : ప్రదీప్ కుమార్
నిర్మాత : విజి సుబ్రహ్మణ్యన్
దర్శకత్వం : రత్నకుమార్
రేటింగ్ : 3/5 
రిలీజ్ డేట్ : 19 జూలై 2019

ఫస్ట్ లుక్ , టీజర్ , ట్రైలర్ లతో సంచలనం సృష్టించిన చిత్రం ఆమె . అమలా పాల్ నగ్న షోతో సినిమాపై అంచనాలు పెరిగాయి . అయితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిన్న సాయంత్రం ఆలస్యంగా విడుదల అయ్యింది ఈ చిత్రం తమిళనాట  . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ : 
కామిని (అమలా పాల్ ) ఇతరుల గురించి పెద్దగా ఆలోచించని మహిళ . తన స్వార్థం కోసం , జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాలని భావించే కామిని జీవితంలో అనూహ్యంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి . దాంతో ఓ బంగళాలో నగ్నంగా పడి ఉంటుంది  కామిని . అసలు కామిని ఆ బంగ్లా లోకి ఎలా వచ్చింది ? ఆమెని బంధించింది ఎవరు ? ఆమెపై అత్యాచారం జరిగిందా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : 
అమలా పాల్
సందేశాత్మక కథనం
దర్శకత్వం
విజువల్స్
కథ

డ్రా బ్యాక్స్ : 
ఆకట్టుకొని కామెడీ

నటీనటుల ప్రతిభ :
కామిని పాత్రలో అమలా పాల్ అద్భుత అభినయం కట్టిపడేస్తుంది . ఆడై చిత్రాన్ని తన భుజ స్కంధాలపై మోసింది అమలా పాల్ . తన పాత్ర కోసం నగ్నంగా నటించి ఈ చిత్రం తనని ఎంతగా ఇన్ స్పైర్ చేసిందో చెప్పకనే చెప్పింది . అమలా పాల్ నటజీవితంలోనే మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం . ఇక మిగిలిన నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు .

విశ్లేషణ :
నిర్మాణ విలువలు బాగున్నాయి , విజువల్స్ తో కట్టిపడేసారు . నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . ఎడిటింగ్ చక్కగా కుదిరింది . ఇక దర్శకుడు రత్నకుమార్ విషయానికి వస్తే ……. కరెంట్ ఇష్యు ని ఎంచుకొని సరైన స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని తెరపైకి అద్భుతంగా తీసుకువచ్చి మెప్పించి సక్సెస్ అయ్యాడు . బోల్డ్ నెస్ మాత్రమే కాదు మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు దర్శకుడు .

ఓవరాల్ గా :
ఆడై  అలరించే  సినిమా