ఆమీర్ క్యాలెండర్ 2020 రిలీజ్ఆమీర్ క్యాలెండర్ 2020 రిలీజ్
ఆమీర్ క్యాలెండర్ 2020 రిలీజ్

బాలీవుడ్ లో ఉండే నటులలో ఆమీర్ ఖాన్ ఒక రకమైన మనిషి. “తనదే లోకం – తనదో తత్వం” అన్నట్లు ఉంటాడు. తనకు నచ్చితే తప్ప సినియా చెయ్యడు. సినిమా రిలీజ్ టైంలో కూడా తనకు మాత్రమే సాధ్యం అనిపించే విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తాడు ఆమీర్ ఖాన్. తన PK సినిమాకు యావత్ దేశం మొత్తం రకరకాల మారు వేషాలతో తిరిగి ప్రమోట్ చేసుకున్నాడు. తన గత చిత్రం “దంగల్” సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ నటుడు టామ్ హ్యంక్స్ నటించిన “ఫారెస్ట్ గంప్” కు రీమేక్.

అయితే తాజాగా ముంబై కి చెందిన ప్రసిద్ద చిత్రకారుడు, ఆమీర్ అభిమాని మనోజ్ సిన్హా  ఆమీర్ ఖాన్ సినిమాలలో  హిట్ అయిన పాత్రలు వాటికి సంబంధించిన డైలాగ్స్ తో ఒక క్యారికేచర్ స్పెషల్ క్యాలెండర్ తయారు చేసారు. ఆ క్యాలెండర్ ని చూసిన ఆమీర్ ఖాన్ మురిసిపోయారు. అందాజ్ అప్నా అప్నా, దిల్ చాహతా హై, లగాన్, గజినీ, తారే జమీన్ పర్, 3 ఇడియట్స్, సీక్రెట్ సూపర్ స్టార్.. ఇలా అన్ని సినిమాల్లో ఆమీర్ క్యారెక్టర్ లు, డైలాగ్స్ అందులో క్రియేట్ చేసారు. ఇక ఆమీర్ ప్రస్తుత సినిమా “లాల్ సింగ్ చద్దా” లో ఆయనకు జంటగా “బాలీవుడ్ బెబో” కరీనా కపూర్ నటిస్తున్నారు. ఇక “మక్కల్ సెల్వన్” విఅజి సేతుపతి ఈ సినిమాలో ఒక ప్రత్యెకమైన క్యారెక్టర్ చేస్తున్నారు. 2020 క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.