100 లొకేషన్స్ కాదు ఇంకా 100 పెరిగిన కుడా నాకు తక్కువే


Amir Khan
100 లొకేషన్స్ కాదు ఇంకా 100 పెరిగిన కుడా నాకు తక్కువే

బాలీవుడ్ సూపర్ స్టార్, ఖాన్ త్రయం లో ఒకలైనా “అమీర్ ఖాన్” ఇప్పుడు స్పీడ్ పెంచేశారు.తన తదుపరి సినిమా గురించి మనకోసం అప్డేట్ ఇచ్చేసారు.

హాలీవుడ్ లో ఆస్కార్ కి ఎంపికైన సినిమా “ఫారెస్ట్ గంప్”ని రీమేక్ చేస్తున్నారు ఖాన్ గారు. సినిమా పేరు కూడా “లాల్ సింగ్ ఛద్దా” అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారు.అయితే నిర్మాతలు తాజా పరిణామాల దృష్ట్యా కొన్ని లొకేషన్స్ లో షూటింగ్ జరిపించాలి, లేకపోతే సినిమా మనకి ఔట్పుట్ మంచిగా రాదూ అని నిర్ణయించుకున్నారు.

దానికి అమీర్ ఖాన్ గారు సరి అన్నారంటే సరిపోతుంది. అయితే దర్శకులు “అద్వైత్ చందన్” కొన్ని లొకేషన్స్ వినిపించారు అందులో బెంగుళూరు,గుజరాత్, ముంబై, హైదరాబాద్, డిల్లీ లాంటి 100 లొకేషన్స్ కావాలి అని నిర్మాతలని ఒప్పించారు.

ఇక మన అమీర్ ఖాన్ గారు ఒకే అంటే షూటింగ్ కూడా నవంబర్ 01 వ తారీఖునుండి మొదలు పెట్టనున్నారు. చూద్దాం అమీర్ ఖాన్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో? అయితే ఈ సినిమాని 2020 డిసెంబర్ లో విడుదల చెయ్యాలి అని అనుకుంటున్నారు.