రాజమౌళి రిక్వెస్ట్ కు ఆమిర్ ఖాన్ ఎస్ చెప్పాడా?



రాజమౌళి రిక్వెస్ట్ కు ఆమిర్ ఖాన్ ఎస్ చెప్పాడా?
రాజమౌళి రిక్వెస్ట్ కు ఆమిర్ ఖాన్ ఎస్ చెప్పాడా?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాను తెలుగుతో పాటు మొత్తంగా ఐదు భాషల్లో నిర్మించనున్నారు.

అలాగే హిందీ వెర్షన్ కు ఆమిర్ ఖాన్ నరేటర్ గా ఉంటాడని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియా ఈ విషయంలో స్పందిస్తూ రాజమౌళి చేసిన రిక్వెస్ట్ ను ఈ బాలీవుడ్ టాప్ హీరో యాక్సెప్ట్ చేసినట్లు రిపోర్ట్ చేసారు. ఇదే కనుక నిజమైతే హిందీ వెర్షన్ కు ఆమిర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు.

అలాగే మిగిలిన భాషల్లో కూడా ఆ భాషకు సంబంధించిన టాప్ హీరోలు వాయిస్ ఓవర్ చెబుతారని సమాచారం.  వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.